ఎ.పి.ఎస్.ఎస్.టి.ఎఫ్. శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఎన్నిక.

 ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్, శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. 
శ్రీకాకుళం జిల్లా కేంద్రాన భారత స్కౌట్స్, గైడ్స్ భవన్ లో  జిల్లా అధ్యక్షులు వై.వి.రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కార్యవర్గం ఎంపికైంది. 
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని, విద్యార్థుల సంఖ్య తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని అన్నారు. 
సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
ఎ.పి.ఎస్.ఎస్.టి.ఎఫ్. జిల్లా నూతన కార్యవర్గంలో 
రాష్ట్ర కౌన్సిలర్లుగా
కరిమి రాజేశ్వరరావు,
కె.రామకృష్ణ, 
జిల్లా గౌరవాధ్యక్షులుగా
వై.వి.రమణ,
జిల్లా గౌరవ సలహాదారులుగా
దానేటి కేశవరావు
జిల్లాశాఖ అధ్యక్షులుగా
తులగాపు కేశవరావు,
ప్రధాన కార్యదర్శిగా
బాడాన రాజు, 
ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గా
మక్కా శ్రీనివాసరావు,
సహాధ్యక్షులుగా
బి.ముకుందరావు,
ఉపాధ్యక్షులుగా
ఎల్.గుణశేఖర్,
ఆర్ధిక కార్యదర్శిగా
ఆర్.అన్నాజీరావు,
ఎన్. ఎమ్. ఎమ్. ఎస్. కమిటీ కన్వీనర్ గా
ఎమ్.లక్ష్మణ రావు, 
అకడమిక్ కమిటీ కన్వీనర్ గా 
టి.రమణ,
డాట్ కమిటీ కన్వీనర్ గా 
ఎస్.రమణ, 
టెక్నికల్ సెల్ కన్వీనర్ గా 
కె.సంతోష్ కుమార్, 
మహిళాధ్యక్షురాలుగా
అధికార్ల పార్వతి, 
మహిళా ప్రధాన కార్యదర్శిగా
సి.హెచ్.సుబ్బలక్ష్మి, 
మహిళా ఉపాధ్యక్షులుగా
జి.పావని కుమారి, 
ఎస్.స్వప్న, 
టెక్కలి డివిజన్ అధ్యక్షులుగా
సామ సంజీవ రావు, 
ప్రధాన కార్యదర్శిగా
బొడ్డేపల్లి పాపారావు,
శ్రీకాకుళం డివిజన్ అధ్యక్షులుగా
పి.వి.రమణ మూర్తి, 
ప్రధాన కార్యదర్శిగా
జి.జనార్ధనరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కామెంట్‌లు