ఘనంగా వోని పాఠశాల వార్షికోత్సవం
 ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు సుగుణాత్మక విద్యను అందిస్తున్న పాఠశాల, వోని పాఠశాల అని పాలకొండ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి అన్నారు. 
వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అధ్యక్షతన జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పరిపూర్ణమైన విద్యాప్రమాణాల సాధనకు వోని పాఠశాల కట్టుబడి కృషి చేస్తుందని అభినందించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన 
పాలకొండ మండల విద్యాశాఖాధికారి కురిటి సోంబాబు మాట్లాడుతూ ఒక విద్యాసంవత్సరంలో పాఠశాల సాధించిన విజయాలే పాఠశాల వార్షికోత్సవం పరమార్ధమని అట్టి సంపూర్ణ సత్ఫలితాలను వోని పాఠశాల సొంతం చేసుకుందని అన్నారు.
సభాధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి పాఠశాల నివేదిక వినిపించారు. 
ఈ వేదికపై ఇటీవల రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వీకరించిన ఈ పాఠశాల ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణను అభినందిస్తూ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపౌరులు ఘనంగా సన్మానించారు. గోగుల సూర్యనారాయణ సేవలను కొనియాడుతూ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబు, అతిథులు తదితరులు ప్రసంగించగా, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు సన్మాన గీతాన్ని ఆలపించారు. ఇదే వేదికపై ఇటీవల పదోన్నతిపై ఈ పాఠశాల నుండి బదిలీ కాబడిన గంగు మోహనరావును, వారందించిన సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. 
ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, మండల విద్యాశాఖాధికారి కురిటి సోంబాబు, 
మండల విద్యా శాఖాధికారి వనరుల కేంద్రంలో పనిచేస్తూ మండల విద్యా శాఖ కీర్తి ప్రతిష్టలకు దోహదపడుతున్న క్లస్టర్ రీసోర్స్ పర్సన్ రాజా, ఎంఐఎస్ కోఆర్డినేటర్ భాను కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, ఎంఆర్సీ బోయ్ సూర్యనారాయణ లను వారి సేవలను కొనియాడుతూ  ఘనంగా సన్మానించారు. 
ఉత్తమ బాలబాలికలుగా అలజంగి హేమంత్, హేమలత, సురవన్న ప్రేమ్ కుమార్, అంబిక, మర్రి భార్గవ్ లకు ప్రత్యేక బహుమతులను అందజేసారు. 
తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వూయక చిన్నయ్య, వైస్ ఛైర్ పర్సన్ కనపాక పుణ్యవతి, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ మెంబర్లు కె.రమణమ్మ, కె.లక్ష్మీనారాయణమ్మ, జి.మోహనరావులు పాల్గొని ప్రసంగించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 
సాహుకారు సాయివర్ష రుద్రమదేవి ఏకపాత్రాభినయం, శ్రావ్య, సాయివర్ష, నయోనిక శాన్వి నాయుడుల 
భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరిన్ని జానపద, నృత్య ప్రదర్శనలతో పలువురు విద్యార్థులు అందరి ప్రశంసలు పొందారు. 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావు, పూర్వ ఉపాధ్యాయులు రెడ్డి గౌరునాయుడు, గంగు మోహనరావు, పెదకాపువీధి హైస్కూల్ ఉపాధ్యాయులు ఎం.వి.రమణ, గడ్డియ్య, సంతోష్, 
డి.చిన్నారావు, అలజంగి శ్రావణి, సురవన్న సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎనిమిదో తరగతి విద్యార్థులు తమకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు బలగ నాగమణి, పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులను ఘనంగా సన్మానించారు. అందరికీ మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు