కుసుమ ధర్మన్న కళాపీఠం
=======================
ఎంత ఆరాటమో భాస్కరునికి
తూరుపమ్మ పురిటి నొప్పులు
తీరకుండానే పరుగులెట్టాలని
అందమే ఆనందం అంటూ...
ప్రకృతిలోని రంగుల బంతిని
చేతబుచ్చుకుని ఆటలాడాలని...
మేఘాల బంతి విరిగిందేమో
వర్ణాలన్నీ నింగిని పరుచుకుని
సన్మోహన రసమయ జీవితం
తలపిస్తున్నాయి ప్రతి అణువూ
మనిషి మేధస్సుకు అందనిది
ఉదయాస్తమయాల సమయపాలన
యుగయుగాల నుండీ జరుగుతున్న
కాల చక్ర పరిభ్రమణ
ఈ నియంత్రిత క్రమంలో
ఏ మాత్రం మార్పులు జరిగినా
కాలకుట విషం స్రవించి
లోక వినాశనం జరుగుతుంది
అందుకే మనిషి జన్మ పొందినందుకు
సత్యం బాటపై నడుస్తూ
స్వార్థాన్ని త్యజించి
అమృత తుల్యం అయిన
ప్రేమను పంచుకుంటూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి