రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావు, మరో సంస్థ నుండి ఉగాది ప్రశంసాపత్రం స్వీకరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న క్రోధి నామ సంవత్సర ఉగాది వారోత్సవాల్లో తిరుమలరావు, ఈ ప్రశంసాపత్రం పొందారు.ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహించిన జూమ్ సమావేశానికి ఆహ్వానం అందుకున్న తిరుమలరావు తన సాహిత్య గానాలాపన చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈమేరకు తిరుమలరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జానపద అకాడమీ తొలి అధ్యక్షులు, ఆర్ట్ ఫౌండేషన్ అధినేత, కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో అక్షర స్వరం పేరిట అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది వారోత్సవాల్లో తిరుమలరావు పాల్గొని, ఆలపించిన స్వీయ గీతం ప్రశంసాపత్రానికి అర్హత సాధించింది.
తిరుమలరావుకు
ఆర్ట్ ఫౌండేషన్, కవిసేన సంస్థల జాతీయ అధ్యక్షులు కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ, నేటి అక్షర స్వరం ఉగాది కార్యక్రమ సభాధ్యక్షురాలు యాళ్ళ ఉమామహేశ్వరి, సమన్వరకర్త లహరి మహేంధర్ గౌడ్ లు అభినందనలు ప్రకటిస్తూ అంతర్జాలం ద్వారా ఉగాది పురస్కార పత్రాన్ని పంపారు.
ఇటీవల విజయనగరంలో ఉగాది రోజున వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కారాన్ని, తెలుగు వెలుగు సంస్థ నుండి జాతీయ స్థాయి ఉగాది పురస్కారాన్ని స్వీకరించిన కుదమ తిరుమలరావు, ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా కూడా ప్రశంసాపత్రానికి ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గారు రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి