వింతలు విశేషాలు! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ
 రేస్ ట్రాక్ ప్లాయా అనే సరస్సు ఎండిపోయి ఉంటుంది.ఇది కాలిఫోర్నియా లో. డెత్ వాలీనేషనల్ పార్క్ లో ఉంది.చాలా వింత సంఘటన జరిగే ప్రాంతం.ఇక్కడున్న రాళ్ళు విందులు వేల సంఖ్యలో అవంతట అవే గునగున కదిలిపోతాయి.చిన్నగులకరాయి మొదలు అరటన్ను బరువున్నవి కూడా రకరకాల ఆకారాలరాళ్లు వంకరటింకరగా మెలికలు తిరుగుతూ పోతాయి.కొన్ని కొన్ని అడుగులు దూరం పోతే ఇంకొన్ని వందల మీటర్ల దూరం దొర్లుకుంటూ పోవటం విశేషం.ఈసరసు వర్షాకాలంలో బాగా నీరు వేడికి లోపల ఎండి చలిలో మంచుతో పేరుకుపోతుంది.ఈరాళ్లు ఇలాంటి వాతావరణంలో వరదకి కదులుతాయి అని భావిస్తారు.తీవ్రమైన గాలికి జారిపోతాయి తడిగా సరసుప్లాయా ఉంటుంది కాబట్టి అని ఇంకో సిద్ధాంతం.కానీ రాళ్లు కదలటం మాత్రం ఇంతవరకు ఎవరూ చూడలేదు సుమా.!
కోస్టారికా ప్రాంతం లో చక్కగా గుండ్రంగా అతి ప్రాచీన రాతిరాళ్ళు ఉండటం విశేషం.వాటిని ఎవరూ చెక్క లేదు సుమా! కోస్టారికా ప్రాంతం అంతా ఈగుండ్రని బంతులు చెల్లాచెదురుగా పడివున్నాయి.క్రీ.శ200_1500 కాలంలో ఎవరైనా చెక్కి ఉంటారని అనుమానం.1930దాకా ఆప్రాంతం వెలుగు లోకి రాలేదు.అరటితోటలపెంపకంకోసం జనం అక్కడకి రావడంతో నున్నని రాతిబంతులు కన్పడ్డాయి.కొన్ని లావాశిలలు కొన్ని లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి తో తయారైనవి. 16 టన్నుల బరువు బంతులు మొదలు వివిధ సైజుల్లో కన్పడటం విశేషం 🌹
కామెంట్‌లు