అమ్మ చనిపోయింది
నేను నమ్మినా నమ్మకున్నా నా మనసు నా మెదడు ఒకటై
అమ్మ ఉన్నట్లే ఉంటుంది
కలగంంటున్నట్లే ఉంటుంది
అమ్మ ఎక్కడికో వెళ్లి మళ్లీ వస్తున్నట్లే
అనిపిస్తుంది
ఇది నిజమని నేను నా మనసు
స్వాంతన పొందుతాను.
నిజానికి అమ్మ చనిపోయింది.
నాకు భయమేస్తుంది.
నాకు ఆకలేస్తుంది
నాకు చలి వేస్తుంది
నాకు నిద్ర వస్తుంది.
ఎప్పటిలా అన్నీ అమ్మే చూసుకుంటుంది.
నిజానికి అమ్మ చనిపోయింది.!!
నా భార్య నన్ను చూసుకుంటుంది.!!
అసలు అమ్మ చనిపోతేగా
మరిచిపోవడానికి
మళ్లీ మళ్లీ అమ్మ రావడానికి
నా గుండెలో నా కడుపులో అమ్మ ఉంది.!!
అమ్మ ఒడిలో నేను
అమ్మ చేతులు నా తలను నిమురుతున్నాయి!!!
నా చెవుల్లో అమ్మ పాట
నా కన్నుల్లో అమ్మ బొమ్మ
నా పెదవులపై అమ్మ పిలుపు
ఇంకా అలాగే ఉన్నాయి
అసలు అమ్మ చనిపోతే గా
కానీ
అమ్మ చనిపోయింది.
అన్నీ నా భార్య చూసుకుంటుంది.!!?
జాతీయ సురక్ష మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి