శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
536) మహాశృంగ-

ప్రళయంలో కాపాడుచుండువాడు 
సాగరమధ్యనావ 
గాచువాడు 
గొప్పశృంగముతో బంధించినవాడు
మహాశృంగయను నామధేయుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
537)మహా వరాహః -

మహిమగల స్వామిగా నున్నట్టివాడు 
మహావరాహమూర్తి యైనవాడు 
ధరణిలో ఆశ్రితుల గాచువాడు
ఆదివరాహమై యున్నట్టివాడు 
538)కృతాoతకృత్-

మృత్యువుని ఖండించినవాడు 
యుగాంతమును ఆపగలవాడు 
భక్తులను దరిజేర్చునట్టివాడు 
యముని నొప్పించగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
539)గోవిందః -

గోవులకు ఆనందమిచ్చువాడు 
భూ ఆధారభూతమైనవాడు 
గోకుల సంచారి అయినవాడు 
గోవిందాయనిన బ్రోచువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
540)సుషేణః -

శోభనమగు సేనగలవాడు 
భక్తులకు సాంత్వననిచ్చువాడు 
ఆధ్యాత్మిక వైద్యము చేయువాడు 
సుషేణ నామధేయమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు