-అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లోనే సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం ఎస్సీ కాలనీ ప్రభుత్వ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వదేశానుసారం 15 మంది మహిళా గ్రూపు తల్లులలతో హెచ్.ఎం. కన్వీనర్ గా, వివో అధ్యక్షురాలు చైర్ పర్సన్ గా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు. తదనంతరం పాఠశాలలో బాల బాలికల మరుగుదొడ్లు, మూత్రశాలల మరమ్మతులకు రూ.90 వేలు, పిల్లల తాగునీటి వసతి కోసం రూ.ఒక లక్ష నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. తొలి విడతగా పనులు ప్రారంభించేందుకుగాను రూ.25 వేలు పాఠశాల ఖాతాలో జమ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఏపీఎం, తన సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో కొబ్బరికాయ కొట్టి, పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ సకల సౌకర్యాలతో వచ్చే విద్యా సంవత్సరానికి గాను పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని, 20 ఏళ్ల విశేష బోధనానుభవం కలిగిన మెరికల్లాంటి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో కృత్యాధార విద్యా బోధనతో పాటు ఆటపాటలతో ఒత్తిడి లేని గుణాత్మక విద్యను పిల్లలకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు, యోగా, నృత్యం, చేతిరాత, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. సైన్సు నమూనాల తయారీ, ప్రయోగాలు చేయించడం, క్షేత్ర పర్యటనలు చేయిస్తూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పాఠశాలలో చదివే పిల్లలకు నవోదయ, సైనిక స్కూల్, గురుకుల, ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక శిక్షణను ఇస్తున్నామని, ప్రాథమిక స్థాయి నుంచే వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలియజేశారు. అంతేకాకుండా పాఠశాలలో చదివే పిల్లలకు ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రిని అందజేస్తున్నామని, సీఎం బ్రేక్ ఫాస్ట్, రాగిజావ, మధ్యాహ్న భోజనం ద్వారా పాఠశాల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేసుకోకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యతోపాటు ప్రభుత్వం అందజేసే ఉచిత సకల విద్యా సౌకర్యాలను పొందాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ ఓరుగంటి శ్రీజ, ఏపిఎం కనకయ్య, ఐకెపి సిబ్బంది శారద, వాణి తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి