సుప్రభాత కవిత ; బృంద
ఆకులు తొడిగిన ఆమనికి
అడుగులు కందక పరచిన
పువ్వుల తివాచీపై నడచి
రమ్మని ఆత్మీయంగా ఆహ్వానం.

పచ్చనాకుల వింజామరల మధ్య
ముచ్చటగా నడచి వచ్చు
వెలుగు రవ్వల చీరచుట్టుకున్న
వాసంత కన్య  ఆగమనం.

కోయిల సన్నాయి పాటలు
గున్నమావిడి  ఉయ్యాలలు
గువ్వల జంటల కువకువలు
ప్రకృతి పాట కచేరీ ఆలాపనలు.


కొత్త చివురులొచ్చి పలికె
శిశిరానికి వీడుకోలు
మండిపడక పండగల్లే
ఉండమని గ్రీష్మానికి వేడుకోళ్లు.

పిల్లలకు మేలుచేసే
తల్లి పడే తపనలాటి
మధురమైన మమతలనే
పంచి మురిపించమని ప్రార్థనలు

మనసులోని మలినమంత
మాసిపోయి మరలునట్లు
జగతి జనుల జీవనము
సుగమరీతిని సాగునట్లు


సత్యమే జయించి తీరునన్న
నమ్మకానికి నీరుపోసి
వృధ్ధి వెలుగులు విరియులాగు
వరములిచ్చి బ్రోచే వత్సరాదికి

శుభోదయ శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు