నెలవంకలా ప్రకాశించాలి;-- ఎం శ్రీరాములు, రచయిత, జడ్‌పిహైస్కూలు, గొల్లపల్లి, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా.
 సృష్టికి ప్రకృతి శోభ నిస్తే అల్లా  పుడమికి వెలుగులను పంచే రేరాజు
విశ్వ దేవుని మాధుర్యం, ఆశీర్వాదం, అందరి హృదయాల్లో కొలువుండాలి
నెలవంకలా ఎదుగుతూ పున్నమి వెలుగులు విరజిమ్మే నవ వసంతం వెల్లి విరియాలి
ఉపవాస దీక్షతో అల్లా ఆశీర్వాదాలు అందుకోవాలి..
దయ, క్షమాపణ, మోక్ష మార్గానికి సంకేతాలని
చెడు ఆలోచనతో చేసే పని నరకానికి రహదారి అని
మానవత్వపు విలువలతో  కూడిన సోదర భావం వెల్లి విరియాలి
క్రమశిక్షణ కలగలిసిన కరుణామూర్తి వై విరాజిల్లాలి
సహనం, పట్టుదలతో లక్ష్యం చేరే నావలా ఒడ్డుకు చేరాలి
ఆధ్యాత్మిక మార్గ అన్వేషణలో అల్లా సన్నిధి చేరే చుక్కాని కావాలి
ఉపవాస దీక్షతో అభాగ్యులకు మార్గదర్శిగా నిలవాలి
రక్త సంబంధమనే వెలుగులను పంచి ఐక మత్యమనే ఆనందాన్ని అందించాలి
అహాన్ని విడిచి మహిమాన్విత మైన శాంతి మార్గాన్ని అన్వేషించాలి
గత తప్పిదాలకు క్షమాపణ చెబుతూ ఉజ్వలమైన జీవితానికి శ్రీకారం చుట్టాలి
నిర్లక్ష్యాన్ని విడనాడి సంకల్ప బలంతో అడుగు ముందుకేయాలి
పాపాలను రూపుమాపి సమాజ అభివృద్ధిలో మూల స్తంభాలై ఎదగాలి
ఈర్ష్యా ద్వేషాలు విడనాడి జన హృదయాలను గెలిచే విజేతలుగా అవతరించాలి
చీకటి ప్రపంచంలో వెలుగులను విరజిమ్మే నెలరాజులా నిత్యం దేదీప్యమానంగా వెలుగొందాలి
 (ముస్లిం సోదరులు, సోదరీమణులకు రంజాన్‌ శుభాకాంక్షలతో

కామెంట్‌లు