1..
మనిషి పేగు బంధము ,
వీడిన మరు క్షణము.
ఆరంభము అనుబంధాల,
మధ్య అదృశ్య దూరము!
తల్లిపాలేలేని ,తల్లిపాలివ్వలేని,
మానవ శైశవము!
పెరుగుతున్న కొద్దీ ఎవరికోసం,
వారే. జీవించడము!
ఈ జగానమిథ్య, మనిషి,
మనిషి కోసం బతకడము!
జీవితాన సత్యం, స్వార్థమే,
పరమ పురుషార్థము!
2.
సంస్కృతి, సాంప్రదాయాలకు,
తిలోదకం!
ఎదగడమే ముఖ్యం ,
జీవన విధానం సౌఖ్యం!
ఎక్కడ నుంచి వచ్చాం?
అసలు ఆలోచించం!
ఎక్కడకు పోతాం ?
అవసరంలేని విషయం!
ఈ ఉన్న క్షణం,
అయితీరాలి అద్భుతం!
3.
సాహిత్యం రుచించదు ,
మనసు వచించదు సదాచారం!
అందరం కృతజ్ఞతలో పేలవం,
ఉపకారం అసలు తలవం!
ఎంతసేపు గుడు గుడు గుంజం,
గుండెలో పలకని రాగం!
మనిషి గానుగెద్దయి,
బతుకు చుట్టూ తిరగడం!
స్పందన కతీతమై,
బండయి పడి ఉండడం!
4.
సత్యం శివం సుందరం,
ఒక చలన చిత్రం (త్తం)!
విషయాలే నిత్యం,
మనిషి దాసోహం!
మనిషిని శాసిస్తోంది,
వాడిలోని ఆహం!
బతుకున ఆలోచన,
అంతా కేవలం ఇహం!
ఏనాడు స్ఫురణకు రాని,
అంశం ఆ పరం!
కరోనా వచ్చి వెళ్లినా, కాటేయడం పాము మానిందా?
అతలాకుతలమవుతున్నా ,
మనిషి,నైజంమారిందా?
________'
మనిషి జడం !మనుగడ జగడం!- డా.పివిఎల్ సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి