మస్తక వేదం; -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 మస్తక ఉత్తేజానికి ప్రేరకమై,
సమస్త విజ్ఞాన సముపార్జనకు,
మానసిక ఉల్లాస ఔషధమై,
వెలుగుబాటలను చూపిస్తుంది.
మహనీయ విషయాల మతలబులను విశదపరచి,
విలువల రాశిని ప్రోగు చేస్తుంది.
అజ్ఞాన అపార్థాలను దూరం చేసి,విజ్ఞాన అర్థాలను ఇస్తుంది.
సువిశాల భావాలను పెంచి,
సుమధుర అనుభూతుల,
జీవిత అనుభవాల పాఠాల,
సారమంతా రంగరించి దాహం
తీరుస్తాయి.
ఉపాధి కల్పనలకు సోపానాలు,
వ్యక్తిత్వ నిర్మాణాలకు పునాదులను,
అవిశ్రాంతంగా వేస్తూనే ఉంటాయి.
కాలచక్ర మార్పులను,అభివృద్ధి 

సూచికలను నిరంతరం అందిస్తూనే ఉంటాయి.
చిట్టి బుర్రల జిజ్ఞాసలకు పదను 
పెడుతూ రాటు దేలుస్తాయి.
పుస్తక పఠనం అనేకానేక విలువల గుప్తనిధియై,
మానవాళి మనుగడకు 
అమృత తుల్యమైన భూమికనే
పోషిస్తాయి.
కామెంట్‌లు