నారుపోసిన నేలమీద
జాలువారే వెలుగులందు
మరకతాల మెరుపులేవో
మరిమరి చేసే మంతనాలుతో
అవని నిదుర మేల్కొని
కవనమాల అల్లుకుని
పరవశించి ప్రతి అణువూ
పవనంతో పల్లవించగా...
విరబూసిన అరవిందాల
అరవిచ్చిన అందాలను
కిరణాలు పలకరింప
విరివనమంతా పులకరించగా..
నూతన వధువుగా మారిన
పుత్తడి బొమ్మ పుడమి కన్యకు
అనుగ్రహమే అక్షింతలుగా
కిరణాల రూపంలో కురిపించగా...
నభమంత రంగవల్లులేసిన
శుభకరమగు పాలమబ్బుల
మాలల తోరణములు కాగా
ప్రభవించే సూర్యుని ప్రభలను
కీర్తిస్తూ మది పాడే
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి