సాకల్యముగా;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కాలమునంత వ్యర్థముగ ఖర్చుచేయక
గాలమువేసి చూడు మదిని
చాలము కలుగు నెమ్మదిగ
జాలములో చిక్కుకొనకు
తాపము మీరనీయకు
దానము ధర్మముల నాచరించి
నాకముజేరి సద్గతిని పొంద
పాప పంకిలము  నంటకుండగ
బాహాటముగా తప్పులు ఒప్పుకుని
మాధవసేవలో తరించ నీ జీవుడు
యాతన లేక యమకూపము  నధిగమించు
రాగద్వేషములు అంతరించగా
లావంతయు ఉడిగిపోగ
వారిదము విచ్చిపోయినటుల నీ 
పాపపు శార్వరము తొలగించివేయును 
సాత్రాజితిప్రియుడు సాకల్యముగా!

{చాలము=కదలిక; జాలము=వల;
నాకము=స్వర్గము;యాతన=కష్టము, దుఃఖము; లావు=శక్తి,బలము;వారిదము=మేఘము;
శార్వరము=చీకటి;సాత్రాజితిప్రియుడు=శ్రీకృష్ణుడు;
సాకల్యము=సర్వము}
*************************************
కామెంట్‌లు