ఉ*మామిడితోరణమ్ములు,సుమమ్ముల నొక్కటగూర్చిదైవమున్
నీమనియామనిన్బ్రతుకు
నెయ్యడసంతసమందు నట్టులన్
రాముడు దివ్యదృష్టినిడి రాగసరాగము లందజేసి యా
రామము నిచ్చి క్రోధి మన ప్రాణము కింత సుఖంబు లిచ్చునో
చ*పులుపుల మామిడుల్ వగరు పొందగవోమనువేసికూర్చుచున్
తలపున తీపి బెల్లములు స్థానమునైచరియింప,కారమున్
వెలుపల నుంచి ప్రేమలిడి వీడనహమ్మును, క్రోధి సంతసం
బులనిడగా 'యుగాది'శుభపూర్ణతగా జరిపించుకోవలెన్
కం* క్రోధీ !వత్సరమా మము
బాధల గొనకుండ గనుమ వసుధా స్థలిలో
సాధనమై, కార్యమ్ముల
శోధనలో దీవెనలిడు శోభితమొప్పన్
ఉ*మామిడి లేతచిగుళ్ళును మాధురులందెడుకొత్తబెల్లమున్
క్షేమమొనర్చు వేపలును చింతయుదీర్చెడుచింతలన్ నిరా
కారపు నీటికిన్గలిపి కారమునుప్పును వోమనింతయున్
మీరగ వేసి జేయనది మిన్నగుపచ్చడి త్రాగరండహో
చ*వనములు మాయమయ్యె కనుపారిననంతట మేడలయ్యె చే
కొనుటకుగింజలేమియనుకొన్నది పొందగపట్టులాయె నా
కనులకు గాన రాని మమకారపు బంధము లెట్టుపోయెనో
వినుటకు వింత, క్రోధి యిక పెన్నిధి నీవయి దారిజూపుమా
మ*గతకాలంబున చింత లున్న నవియున్గావింపదౌర్భాగ్యమున్
సతతంబింతయుసౌఖ్యమందుకొనకన్ సాధింపులన్నొందినన్
మతివీడంగ విషాదహేతు వయినన్మార్గంబుదాజూపుచున్
స్థిత ప్రజ్ఞుండుగ నిల్వ క్రోధి వరెలెన్ చైతన్యమందించగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి