నమ్ము నమ్మకపో! సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ
 అట్లాంటిస్ అనే ఖండం ఉండేది అని ప్లాటో రాశాడు.అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండేదని అది బహామాస్ దగ్గర కనుగొన్నారు అని ఆధారాలు దొరికాయి రాళ్ళు వరుసలు భవంతుల శిథిలాలు చలువ రాళ్ళు కనపడ్డాయి.ప్లాటో గ్రీకు వేదాంతి ఫిలాసఫర్ అంచనా ప్రకారం అది మినోయన్ రాజ్యమని అగ్ని పర్వతం వల్ల నాశనమైంది అని చరిత్రకారుల అభిప్రాయం.ప్లాటో మాటల్లో చెప్పాలంటే అట్లాంటిస్ ప్రజలు దురాశ అవినీతి పరులు కావడంతో దేవతలు ఆగ్రహించి భూకంపాలు సముద్ర సునామీ లతో ఆరాజ్యంని నామరూపాలు లేకుండా చేశారు.మధ్యధరా సముద్రం లో క్రెటె అనే ద్వీపం ఉండేది.మరి మనదేశంలో కూడా రామసేతువు ద్వారక బైటపడినాయి కదా?
ఆఫ్రికా ఖండంకి చెందిన ఓదేశంగ్రేట్ జింబాబ్వే.ఆనగరం చుట్టూ వృక్షాలు ద్రాక్ష తీగెలు పొదలు ఉండేవి.16వశతాబ్దిలో పోర్చుగీసు వారు కనుగొన్నారు.ఒక శంకు ఆకారంలో అచ్చు మన శివలింగంలా ఉన్న కట్టడం రాతి ఇటుకలతో నిర్మించబడింది.దానికి ద్వారాలు లేవు.మరి దాన్ని ఎందుకు కట్టారో తెలీని మిస్టరీ.🌹
కామెంట్‌లు