లలిత కళలు ;-... కోరాడ నరసింహా రావు!

 అరువదినాలుగుకళలలో...
  లలిత కళలు అతి కొద్దే ...!సాహిత్య, సంగీత , నాట్యా భి నయముల వలె చిత్ర  కళయు ఎంతొ  వాసి కెక్కినది !! 
 ఘనత గల చిత్ర కారులప్రతిభ 
వేరే కళల లోని వారి ప్రతిభకూ తీసి పోనిది...! 
  అనేక రీతుల విస్తరించిన చిత్ర కళ వేనోళ్ళ కొనియాడుట ఆ కళ కున్న గొప్పతనమే...!! 
ఒక మహాయుద్దమునుసైతము
 ఆప గలిగిన చిత్రమును చిత్రించ గలిగిన ఆ చిత్ర కారు డెంత ధన్యుడో...! 
చిత్రములకు అత్యంతధరలను  చెల్లిస్తూ... చిత్రకళను ప్రేమించి, అమితముగప్రోత్సహించుమహనీయులుఅభినందనీయులే!
  కళలు వర్ధిల్లాలి...! 
  మన భారతీయ సంస్కృతి విలసిల్లాలి..!! 
      ******

కామెంట్‌లు