ప్రాణు లన్నిటిలో మనుషులమే
గొప్పవారమని తెలియునా...
మీకు పిల్లలూ....?
మా ట్లాడ గలుగుట, నవ్వ గలుగుట...
నిటారుగా నిలబడ గలుగుట
చక్కనిలిపితోరాసి,అంద
ముగా. చదువ గలుగుట...!
సృష్టి లో మరే ప్రాణికి లేవు
కేవలము ఇవి మనకే
ఉన్నవి పిల్లలూ !!
మట్టి, రాయి, కర్ర, లోహ0....
దేని నైనా తీసు కుని...
అందమైన ఆకృతులుగ మార్చే
అద్భుత మైన తెలివి తేటలు
మన మనుషులకే
ఉన్నవి పిల్లలూ ..!
పక్షిని చూసి విమానమును
చేపను చూసి పడవలను...
రోకటి బండినిచూసి రైలు బండ్లను ,
గిజిగానినిచూసి,నేతపనులను
నేర్వగలిగిరి మన మనుషులే పిల్లలూ...!
అంతరిక్షమును చేదించితిమి
సముద్రగర్భము సోధించితిమి
ఆటవికులుగా ఉండే మనము
నవనాగరికులు కాగాలిగితిమీ!
గొంగళి పురుగుల్లా
ఉన్నమను షులు
శీతా కోకచిలుకల్లా... మారలేదు ఈ నాటికిని...!!
మీరైనా మారండి పిల్లలూ....
మీ అందమైన హృదయాలతో
ఈ కురూపి మానవ సమాజాలలో...ఆనందాలను నింప0డి పిల్లలూ...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి