షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.
ఈ పచ్చడి తయారీ చేయడం కోసం చెరకు, మామిడి పిందెలు, అరటి పళ్ళు, చింతపండు, వేప పువ్వు, బెల్లం, జామకాయలు మొదలగునవి వాడుతుండటం ఆనవాయితీ.
రుచులు అనేక రకాలు ఉన్నప్పటికీ మన ఆయుర్వేదము ఆరు రుచులు అని చెపుతుంది. వాటినే షడ్రుచులు అంటారు. షడ్రుచులు అంటే...
తీపి - ఉదా: పంచదార, తేనె
పులుపు - ఉదా: నారింజ, నిమ్మకాయ
చేదు - ఉదా : వేప, పసుపు, మెంతులు
కారం - ఉదా : మిరప, మిరియాలు
వగరు - ఉదా : చిక్కుడు, కాలీఫ్లవర్, మినప పప్పు
ఉప్పు - ఉదా : సముద్రపు నీరు, సైందవ లవణము
ఈ పచ్చడిలో పోషకాలు వ్యాధుల నుండీ రోగాల నుండీ రక్షిస్తాయి. ఈ పచ్చడిలో తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే ఆరు రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్టే జీవితంలోని కష్ట సుఖాలనూ, ఎగుడుదిగుళ్ళనూ, మంచి చెడులనూ సంయమనంతో స్వీకరించాలన్నది అందులో ఉన్న పరమార్థమని చెబుతారు.
ఉగాది రోజున అభ్యంగ స్నానం చేసి.. ఉగాది పచ్చడి చేసి.. పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. మనిషి జీవితంలో ఉండే ఎదురయే కష్ట సుఖాలను ఒకేరీతిన చూడాలని సూచిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి