మనుస్మృతి 2000 సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం రెండు, మూడు దశాబ్దాలలో రచించిన ఒక ప్రాచీన హిందూ ధర్మ నియమావళి.మనువు అనే రుషి ప్రధానంగా రాసినట్లు చెప్తున్న ఈ గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయని ఇప్పుడు లభ్యమవుతున్న ఆధారాల వలన తెలుస్తోంది.ఈ నియమవాళిని మను ధర్మ శాస్త్రం లేదా మానవ ధర్మ శాస్త్రం అని పిలుస్తారు. ఇందులో గృహ, సామాజిక, మతపరమైన నియమాలు ఉంటాయి. మను స్మృతిలోని ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి ప్రస్తావించారు.మను స్మృతిలోని 5వ అధ్యాయంలో స్త్రీల కోసం చాలా నియమాలను పొందుపరిచింది.
"ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు" అని మనుస్మృతి చెబుతుంది.స్మృతి అంటే మానవుడు. సంఘంలో ఎలా మెలగాలి? పెద్దలపట్ల ఏ విధంగా వుండాలి? గృహస్థుడిగా తన బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి? వ్యక్తిగా తన జీవన విధానం ఏ విధంగా వుండాలి? జీవితంలో వివిధ దశల్లో ఎలా వ్యవహరించాలి? ఆయా వర్ణాల ప్రజలు, స్త్రీ పురుషులు ఆయా సందర్భాలలో ఎవరితో ఎలా వ్యవహరించాలి? ఇత్యాది ప్రవర్తనా నియమాలను తెలిపేది.భోజనం చేసేటప్పుడు నిర్మల మనస్కుడై వుండాలి. చింతలను వదలాలి.
ఈ స్మృతి ప్రకారం ప్రతీరోజు భోజనం చేసే ముందు “ఇలాంటి భోజనమే మనకెప్పుడూ లభించుగాక” అని స్తోత్రము చేయాలి. అలా స్తుతించి చేసిన భోజనము శక్తినిస్తుంది. అలా స్తుతించకుండా భోజనం చేస్తే శక్తి నశిస్తుంది.
ఎంగిలి అన్నం ఎవ్వరికి పెట్టకూడదు. మధ్యాహ్నం, రాత్రి తప్ప మధ్య మధ్య భోజనం చేయకూడదు. ఎంగిలి చేతితో అటు, ఇటు తిరగకూడదు. మితిమీరి భోజనము చేయకూడదు. మితిమీరి భోజనం చేయడం అనారోగ్యహేతువు. ఆయుస్సును నశింపజేస్తుంది. ప్రతిరోజూ వేదాధ్యయనం ప్రారంభించేముందు, ముగించేముందు గురువు పాదాలను చేర్చి పట్టుకోవాలి. అధ్యయనం చేసేటప్పుడు చేతులు కట్టుకోవాలి. అలా చేతులు చేర్చడాన్ని బ్రహ్మాంజలి అంటారు.ఇంద్రియాలను లోబరచుకొని, మనసుని గట్టిపరచుకుని, ఉపాయంతో దేహాన్ని బాధ పెట్టక సకలార్థాలను సాధించాలి. అలా సాధించిన పిదప అతడు క్రమంగా ఆ దేహాన్ని వదలాలి.తానూ నొచ్చుకున్నా యితరులు నొచ్చుకునేట్లు మాట్లాడకూడదు. ఇతరులకు ద్రోహం కలిగించే కార్యాలను మనసులోకి కూడా రానివ్వకూడదు. ప్రజలకు భయము, ఆందోళన కలిగించే మాటలు మాట్లాడకూడదు.
మనుస్మృతి-సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి