జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి 80వ జన్మదిన సందర్భంగా జరిగే కార్యక్రమంలో జయమిత్ర సాహిత్య, సాంస్కృతిక వేదిక అభినందన సత్కారసభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ గారికి పురస్కారం సగౌరవ సమర్పణ, కేంద్ర సాహిత్య అకా డమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రసిద్ధ అనువాదకులు, కవి ఎలనాగ గారికి జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడి అభినందన సత్కారం జరుగుతాయి. ఏప్రిల్ 7వ తేదీ, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల కు రవీంద్ర భారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు)లో జరిగే ఈ సభకు అధ్యక్షులుగా డా॥ అమ్మంగి వేణుగోపాల్ వ్యవహరిస్తారు. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యురాలు వాణీదేవి సురభి, గౌరవ అతిథులుగా మాజీ మంత్రి డి.కె. సమరసింహారెడ్డి, పీవీ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు పి.వి. ప్రభాకరరావు పాల్గొంటారు. విశిష్ట అతిథులుగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా॥ వై.రామకృష్ణా రావు, పి.లక్ష్మీనారాయణ విచ్చేస్తారు. ఆత్మీయ అతిథులుగా డా॥ ఎం.కె. రాము, ఎస్.టి.సురేందర్ రావు, ఆచార్య ఎం. శంకర్ రెడ్డి, డా॥నాళేశ్వరం శంకరం, కోట్ల వేంకటేశ్వరరెడ్డి, డా॥ గంటా జలంధరరెడ్డి, చీకోలు సుందరయ్య, అమ్మంగి కవితా స్వామి హాజరవుతారు. సమావేశ సంధానకర్తగా డా|| రాయారావు సూర్యప్రకాశ రావు వ్యవహరిస్తారు.
జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యక్రమాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి