సద్గురువు ప్రాశస్త్యం;-సి.హెచ్.ప్రతాప్

 సద్గురు అంటే విద్య లేని గురువు అని. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవంవల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు అనేది ఒక సంబోధన కాదు. ఇది ఒక విశ్లేషణ. సద్గురు అంటే విద్య లేని గురువు. మనుషులకు ఆత్మజ్ఞానం ముఖ్యం. స్వస్వరూప జ్ఞానం గురువును ఆశ్రయించకనే తెలుసుకోగలిగిన వారు అరుదు. చిన్నచిన్న విషయాల్ని కూడా తెలుసు కోలేక చీకట్లో రోజులు వెళ్ళబుచ్చేవారి గురించి బాబా చింతిస్తారు. గురువు అంటే మాయ, మర్మం, వేదాం తం కాదు. జీవితానికి సంబంధించిన జ్ఞానం అందిం చాలి. మనుషులుగా ఎలా మసలుకోవాలో తెలియ జేయాలి. మనుషుల్ని మంచి వైపు నడిపించాలి. ఈ కలియుగంలో మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు.కల్లోల కడలిలో క్రుంగిపోతున్నా , తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ సద్గురువును నమ్ముకున్న వారు మరింక ఏ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవచ్చు.ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగితా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మోయలేక మోస్తూ, కృంగిపోతూవుంటారు.
కామెంట్‌లు