దత్తపది ;-సాహితీ సింధు ,పద్యగుణవతి సరళగున్నాల
రేపు మాపు కాపు చూపు పదాలతో 
-----------------------------------------

కం*రేపటికింతని దాచుచు
మాపటివేళింతదినక మనుగడనెట్టుల్
కాపాడక దేహమ్మును
చూపగనే సాకులైన శుభమేలగురా

ఉ*రేపటి రోజునన్ కుడిచి శ్రేయమునందగ నుంటినంచు నీ
మాపున బోనమున్గొనక మైకముగ్రమ్మగశ్రాంతిలేకయున్
కాపుర మెట్టు సాగు నిక కంటికి మింటికియేకధాటిగా
చూపును పోవునట్లు పరిశోధనకై యుదకమ్ము గార్తువే

ఉ*రేపటి మాట వేరు ,సిరి లేకను జీవనయాన మందునన్
మాపటివేళలో నిదుర మాటున నించుక బాధదప్పినన్
కాపురమందు కష్టములు క్రమ్మిన నీడగ వెంటనుండగా
చూపున సంతసమ్ముగన చోద్యమె యౌగద బీదవానికిన్
కామెంట్‌లు