గగనమంత నిండగా నినదించరా
కణ కణమున దేశభక్తి రగిలించగా
స్వాతంత్ర్యమే మన హక్కని చాటాలిరా
మంత్ర మదియె మనగుండెలొ నిలవాలిరా
గాములరేడుగ నీవు జగతిన వెలగాలిరా
నిజమెరిగిన ప్రపంచము తలవంచునురా
మనమునిండుగా నిన్ను దీవించునురా
కుతంత్రమేదైనను కూలదోయుమురా
సూత్రధారివై నీవు ముందు నిలవరా
ఆము గల వైరిని అణగదొక్కరా!!
{గాములరేడు=సూర్యుడు;
ఆము=మము}
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి