పోతన పొలంలో
మొలకెత్తిన కవిత!!
కవి సార్వభౌముడు
శ్రీనాథుని పెదాలపై
నాట్యమాడిన కవిత!!!
జక్కన్న చెక్కిన శిల్పంలా
తిక్కన కల్పన ఆ కవిత!!!
నన్నయ మహాభారత కథలో
కన్నయ్య కన్న మహాద్భుత కవిత
మా తెలుగు కవిత!!
అన్నమయ్య రచించిన
కలియుగ ప్రభువుమిచ్చిన
ఆ కవిత మా తెలుగు కవిత!!
పామరుల నాల్కల్లో నాని
పలుకుతున్న కవిత!!
ప్రజల కన్నుల్లో సుదర్శన చక్రంలా
తిరుగుతున్న దివ్య కవిత!!
విశ్వ శంఖం పూరించిన శబ్దంలా
చెవుల్లో మారుమోగుతున్న మహా కవిత
మా తెలుగు కవిత!!!
నిశ్శబ్దంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు
నిదానంగా చంద్రుడు ఉదయిస్తున్నాడు
ఒక మహా సముద్రం మా కవిత
ఊరేగుతున్న
ఒక మహా రథం మా తెలుగు కవిత!!!
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి