పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని దీవించడం వింటూనే ఉంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అది ఉన్న చోట దేనికీ ఎలాంటి లోటు ఉండదు. అయితే ఆ ఐశ్వర్యమొక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు. అవి కేవలం ఐహిక భోగాలు మాత్రమే. ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలిగేది అతనికి అష్టైశ్వర్యాలు సిద్ధించినప్పుడే అని మన శాస్త్రాలు బోధిస్తున్నాయి.ఆత్మస్థైర్యం ఉంటేనే మనుగడ!అందుకే అష్తైశ్వర్యాలలో ఆత్మ స్థైర్యానికి ఎంతో ప్రాధాన్యత వుంది.
మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒకానొకసారి మనల్ని బలవంతుల్ని చేస్తే, మరొకసారి బలహీనుల్ని చేస్తోంది. బలహీనమైన సందర్భంలో మనలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మన మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలుపోటములను లెక్కచేయకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు. ఓటమి, కష్టాలు, బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధీమాతో ముందుకు సాగేవారే నిజమైన ఐశ్వర్యవంతులు.
ఇటీవలే వెలుగు లోనికి వచ్చిన ఒక గొప్ప విషయం ఏమితంటే బెంగళూరులో సామాజికవేత్త గురు సయ్యద్ సలావుద్దీన్ పాషా వినూత్నంగా వికలాంగులకు యోగా నేర్పిస్తున్నారు. యోగా ద్వారా వికలాంగుల్లో వారి మానసిక దౌర్భల్యాన్ని దూరం చేసి వైకల్యానికే కొత్త అర్థన్నిస్తున్నారు. చక్రాల కుర్చీ నృత్యాల ద్వారా విన్యాస ప్రదర్శనలు ఇప్పిస్తూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నారు.యోగా శారీరక, మానసిక అడ్డుగోడలను తొలగించింది. లోపం ఉన్నట్టు భావించొద్దని బోధించింది. జీవితాన్ని పారదర్శకంగా చూసే శక్తినిచ్చింది. స్వతంత్రంగా మెలిగేలా చేసింది’’ అని గురు వివరించారు.వేలాది దివ్యాంగులలో ఆత్మస్తైర్యాన్ని నింపుతున్న గురు సయ్యద్ సలావుద్దీన్ పాషా యావత్ ప్రపంచానికే ఆదర్శనీయం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి