శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
551)దృఢః -

బలమైన మూర్తిమత్వమున్నవాడు 
చలించని స్వభావమున్నవాడు 
దృఢమైన రూపునగలవాడు 
చెదరని వీరత్వమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
552)సంకర్షణోచ్యుతః -

ప్రళయమందు మార్పులేనివాడు 
బలరామునియంశనున్నవాడు 
సంకర్షణోచ్యుతనామమున్నవాడు 
విశ్వమందునిలిచిన వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
553)వరుణః -

ద్వాదశాదిత్యులలోని వాడు 
నీటిరేడుగా పిలువబడువాడు 
కిరణములుపసంహరించువాడు 
పడమరకధిపతియైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
554)వారుణః -

వశిష్ట అగస్త్యులుగా నున్నవాడు 
వరుణదేవుని రూపునున్నవాడు 
పడమటిదిక్కునున్నట్టి వాడు 
వారుణనామమున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
555)వృక్షః -

భక్తులకు నీడనిచ్చునట్టివాడు 
అనుగ్రహఛాయను ఒసగువాడు 
తరువువలే కాపాడెడివాడు 
జీవితఫలమునొసగుచున్న వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు