పంచమ వేదం;-సి.హెచ్.ప్రతాప్
 మహాభారతాన్ని’ మాత్రమే పంచమవేదమని పిలుస్తారు. ‘భగవద్గీత’ మహాభారతంలో ఉన్నందువల్ల ఈ ఇతిహాసానికి ఆ పేరు వచ్చింది.  వేదాలకు వ్యాసమహర్షి తన శిష్యుల ద్వారా ప్రచారం గావించారు. కనుక,‘వేదవ్యాసుడ’య్యాడు. ఆ వేదవ్యాస మహర్షి చేత ప్రణీతమైనందున మహాభారతమే పంచమ వేదమనీ పిలువబడింది. నాలుగు వేదాలలో భగవంతుని గురించిన అత్యున్నత జ్ఞానం ఉంది. నాలుగు వేదాల జ్ఞానం  బ్రహ్మ ద్వారా ఇవ్వబడింది . భగవద్గీత అనేది నాలుగు వేదాల సారాంశం, ఇది కూడా అ భగవంతుడే స్వయంగా అర్జునుడిని నిమిత్య్తమాత్రంగా చెసుకొని సమస్త మానవాళి శ్రేయస్సు కాంక్షిస్తూ అందించినది.
ఐదవ వేదము నాలుగు వేదాల పైన మరియు అంతకు మించిన అత్యున్నతమైన జ్ఞానం యొక్క భాండాగారం మహాభారతంలో వుంది. ఐదవ వేదంలో జ్ఞానాన్ని పరమాత్మ స్వయంగా అందించాడు. పరమాత్మ మాత్రమే తన రహస్యాన్ని ఇవ్వగలడు. పరమాత్మను గూర్చిన జ్ఞానాన్ని సర్వోన్నతుడైన భగవంతుడికి తప్ప మరెవరికీ లేదు. పంచమ వేదం సర్వోన్నతుడైన భగవంతునిచే చెప్పబడిన మరియు అందించబడిన సమస్త జ్ఞాన సమాహారం. పూర్వపు దేశ కాల మాన పరిస్థితులను మనం గమనించినట్టైతే, నాటి కాలంలో వేదాధ్యయనం అనేది కేవలం పండితులకు మాత్రమే అందుబాటులో ఉండేది. కాబట్టి సామాన్య ప్రజలకు ఆ వేదాలలోని సారాన్ని అందించే నిమిత్తమే వ్యాసులవారు మహాభారతమును రచించి, లోకానికి అందించారు. వేదాలలో ప్రభోధించిన మంచి చెడులను మహాభారతంలో జరిగిన సంఘటనల ద్వారా జన సామాన్యంలోకి తీసుకువచ్చారు.ఆ నాలుగు వేదాల సారమే మహాభారతంలో నిబిడీకృతం అయి ఉన్నది కాబట్టే మహాభారతానికి పంచమ వేదం అనే సార్థక నామధేయం వచ్చింది.మహాభారతంలో ‘‘ధర్మం’’ అనే ఏకసూత్రం అంతర్లీనంగా వుంది. దానిని పాటించే వారిని, పాటించని వారిని గమనించే ‘‘విధాత’’ పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పని చేస్తుంది.యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చెలామణీ అవుతున్నాయి.మహాభారతగాథ ఒక మహాప్రవాహం. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ.మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.

కామెంట్‌లు