సుప్రభాత కవిత ; - బృంద
నలిగి పోయిన మనసు
వెలిగి పోయేలా
ఎదురు చూసిన  చూపు
కుదురుగ నిలిచేలా

నీ అడుగుల సవ్వడి
నా గుండెకు తెలిసేలా
నీ కరుణకు నోచిన
నా  మనసు నిండేలా

నా మొరలన్నీ విని
నాకు చేయూతగా నీవు
నన్ను నడిపించాలని
నాకోసం వస్తున్నావని

తెలియకనే మది ముంగిలి
ముగ్గులతో నింపాను
శ్వాసల పువ్వులు పరచి
ఆశగ ఎదురు చూసాను

నీ ప్రసన్న వదనపు కాంతులతో
పోటీపడుతూ తొలివేకువ 
రేఖలు నింగి నిండిపోగా
నీ పాదం తాకి పుడమి పుత్తడైనది

నను పాలింపగ నడచి వచ్చే
నిన్ను చూడ వేయి కనులు 
చాలక నీ పదరేణువునై
పాదముల అంటివుండే వరమీవా!

సీతారామస్వామీ
ఇదిగాక భాగ్యమింకొకటి కలదా?
ఇలను నీ దర్శనమీ రీతి దొరుక
కల కాదు కదా..కల్యాణరామా!

మది మదినీ మందిరం చేసే
దివ్య నామ సంకీర్తనతో

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు