తెలుగు వారి తొలి పండుగ ;- -అద్దంకి లక్ష్మి -ముంబై
 పద్యాలు 
1
క్రోధి వత్సర మిది కోరిక తీరంగ
పుడమి పలకరించ పండుగొచ్చె
తెలుగువారి ఇంట తీయదనము నింపు 
సర్వ మానవాళి సకల శుభము 
2
వేప పువ్వు పూచె వేవేల యందాలు
  చిగురు వేసె తరువు శోభ చూడు
పరవశించు మదిలొ ప్రకృతి అందాలు 
  పరిమళాలు జల్లు పరిసరాలు 
3
నవ్యవత్సర మిది సవ్యముగ జరుప
సంఘ మందుజనులు శాంతి సుఖము 
కూడి జనులు కలిసి క్రోధము విడనాడి 
మమత సమత భావ మనకు మేలు
4
ఆరు రుచులు తినిని యారోగ్య భాగ్యము 
 కోటి యాశలన్ని కోరి తీరు
అన్నదాత లకును నవని దీవించెను 
 పచ్చ పచ్చ పైరు పసిడి పంట
5
 పండితులు గలసిరి పంచాంగ శ్రవణము 
  కవులు పాడినారు కమ్మగాను 
చైత్రమాస మందు చైతన్య మవనికి
 తెలుగువారి మదిన వెలుగు నింపు

కామెంట్‌లు