పరమౌషధం - అల్లం;- సి.హెచ్.ప్రతాప్
 అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది .  సరైన ఆహారం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం మధుమేహానికి కారణం అని వైఫ్య నిపుణులు చెబుతున్నాశ్రు. అంతే కాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా మధుమేహం రావచ్చు. అందువల్ల, అల్లం ఈ వ్యాధి ప్రమాదాలను నియంత్రించడానికి, అది రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.మనం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలలో అల్లం ఒకటి. మన శరీరంలోని చాలా సమస్యలను అల్లంతో పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. అల్లం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుందని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి.అల్లంలో యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ నొప్పి నివారిణిగా,  జ్వరాన్ని తగ్గించేదిగా పనిచేస్తుంది.అల్లం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. అల్లం జింజెరోల్ కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్నీ క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది.అల్లంను ఉపయోగించడం వల్ల పెరిఫెరల్ సర్క్యులేషన్ అవుతుంది. అలానే మెనుస్ట్రువల్ క్రాంప్స్ కూడా తగ్గుతాయి. వేడి వేడి అల్లం టీ తీసుకుంటే మెనుస్ట్రువల్ క్రాంప్స్ సమస్య తగ్గుతుంది. 
కామెంట్‌లు