మహారాష్ట్రాలోని హర్ధా గ్రామంలో నివసించే ఒక వృద్ధుడు మూత్రకోసంలో రాయితో బాధపడేవాడు. ఆ రాయిని ఆపరేషను చేసి తీయాలని దాక్టర్లు సలహా ఇచ్చారు కాని అప్పటికే 70 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ వృద్ధుడు స్వతాహాగా మనోబలం లేనివాడు కావడం చేత ఆపరేషనుకు ఒప్పుకొనలేదు. ప్రసిద్ధులైన దాక్టర్లు మందుల ద్వారా ఆ రాయిని కరిగించాలని చూసారు గాని అది సాధ్యపడలేదు. కనుక ఆ బాధ వలన ఇక మరణమే శరణ్యమని ఆ వృద్ధుడు తీవ్రమైన మనోవేదనను అనుభవించసాగాడు.ఒకరోజు ఆ గ్రామపు ఇనాముదారు ఆ వృద్ధుడు ఇంటికి ఏదో పని మీద రావడం జరిగింది.ఆ వృద్ధుడు పడే బాధను గమనించి తన వద్దనున్న శ్రీ సాయి వీభూతిని నీటిలో కలిపి ఆ వృద్ధుడు చేత త్రాగించాడు. అపరయోగీస్వరుడూ, పరబ్రహ్మస్వరూపీ అయిన శ్రీసాయినాధుని విభూతి మహిమ చూడండి. అయిదు సంవత్సరాలలో కరగని ఆ రాయి విభూతిని సేవించిన అయిదు నిమిషాలలోనే కరిగి మూత్రంతో పాటు బయటకు వచ్చింది.ఆ వృద్ధుని బాధ శ్రీఘ్రమే మటుమాయం అయ్యింది. తాను కోరకుండానె తన బాధను తగ్గించి తన జీవితంలో వెలుగురేఖలను నింపిన కలియుగదైవం శ్రీసాయికి ఆ వృద్ధుడు అనేక వేల కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు.
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.[15] ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు.తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి