పల్లే గొప్పతనం ;- బి.శిరీష - :రామరాజుపల్లే
 అనగనగా ఒక అందమైన పల్లే. ఆ పల్లెలో ఇద్దరు అందమైన స్నేహితులు వుండేవారు.వారు ఒక్కరిని విడిచి ఒక్కరు వుండేవారె కాదు.కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాము పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. రాము మాత్రం వ్యవసాయం చేసుకుంటూ పల్లే లోనే వున్నాడు. అలాగే రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తునే వున్నాయి. కొన్ని సంవత్సరాలకు రాము రాజుని చూడడానికి వచ్చాడు. అప్పుడు రాజు పొలాన్ని దున్నుతూ వుంటాడు. రాముని చూసి ఎప్పుడోచ్చవ్ రాము బాగున్నావా నాకేంటి రాజు నేను మంచిగా ఎసి కింద కూర్చొని ఉద్యోగం చేస్తూ హఈగా సమయానికి కడుపునిండా తిని పడుకుంటున్నాను రాజు. నువ్వు  ఎందుకు రాజు ఇంత ఎండలో కష్టపడుతున్నావ్ .మా పట్టణానికి వచ్చేయ్ మంచిగా ఉద్యోగం చేస్తూ మన సంతోషం కోసం సినిమాలకు పార్కులకు తిరిగి సమయానికి ఆహారంని తింటూ హైగా పడుకోవచూను.జీవితాన్ని చాలా సంతోషంగా గడపవచ్చు రాజు ఇంకా ఆలస్యం ఎందుకు రాజు వచ్చేయ్ వెళ్లిపోదం పట్టణానికి. అపు రాము పట్టణం గురించి. మీ పట్టణం నీకు నకు మాత్రం కాదు.మనం చిన్నప్పటి నుండి పుట్టిపెరిగిన పల్లే రాము ఇది నువ్వు సుకం గురించి ఆలోచిస్తున్నావ్ కాని దానికి కారణం ఎవరు అని ఆలోచించడం 
లేదు రాము.అబ్బా!ఏమి చెప్పినావ్ తీ రాము ఈ పొలాలు ఎందో ఆ బురద అంత నీకు అంటూడు ఎందో.ఇది నాకు చూడడానికే చెండాలంగా వుంది చిచి వద్దు రాజు పట్టణానికి వచ్చేయ్ హైగా బ్రతుకుద్దాం రాజు. నీకు గుర్తుకు వుందో లేదో నాకూ తెలియదు రాము కానీ మనం చిన్నప్పుడు పల్లే గురించి ఎలా అనుకునేవాళ్ళమే తెలుసా!మా పల్లే అందమైన పల్లే ప్రకృతి వనంతో,అలల శబ్దాలతో ,పక్షుల కిలకిలలు,కోకిల రాగాలు ,నెమలి నాట్యలు,శుభ్రమైన పాలను ఇచ్చు పశువులు,పొలాన్ని దున్నుతే వచ్చే మట్టి వాసనా విటిని కలిగి ప్రజలు మరియు రాము,రాజు కలిసి వుండడాన్నే పల్లే అని అంటారు అని మనం వుకే అనుకునేటోలం గుర్తుకువుందా రాము. ఆ గుర్తుంకు వచ్చింది రాజు మనం చిన్నప్పుడు పల్లేలో ఎంతో బాగునేటోలం కధా రాజు. అవును రాము నువ్వు రాగానే ఆ బురద ఏంటో,కర్ర ఏంటో  పశువులకు తలిగించి నీకు బురద అంటుడు ఎంటో చూడడానికే చెండాలంగా వుంది అన్నావుగా రాము. అది కర్ర కాదు రాము దానిని నాగలి అని అంటారు అది మా దృష్టిలో వంద మందికి ఆహారాన్ని అందించే అన్నదాత. అవునా అలా ఎలా రాజు. రాత్రనక పగలనక రెండు ఆవులు మధ్య కర్రను తగిలించి వాటి మద్యలో నాగలిని కట్టి పొలాన్ని మెత్తగా దున్ని దాని తర్వాత వడ్లను కట్టిపెట్టిన మూడు రోజులకు అవి మొలకలుగా వస్తాయి. ఆ మొలకలను పొలంలో చల్లి చల్లిన తరువాత అవి రెండు వారాలకు మొలకలుగా వస్తాయి. మళ్లీ నాగలిని చేత పట్టి నడిపించి ఆ మొలకలను పొలంలో నాటితే అవి కొన్ని నెలలకు వరిగా అవుతుంది. దానిని కోస్తే వడ్లు వస్తాయి. వాటిని ఒక కుప్పగా పోసి వాటిని చెరిగి పట్టిస్తే బియ్యం అవుతాయి. ఇదే మన నాగలి గొప్పతనం. ఇప్పుడు నువ్వు హైగా వుంటున్నావ్ అని అంటే దాని వెనుక కారణం రైతు అని మరిచిపోకు రాము.ఐన నేను ఇంత అందమైన పల్లేను విడిచిపెట్టి పట్టణానికి ఎలా రాగాలను చెప్పు రాము. అవును రాజు నేను ఇన్ని రోజులు సంతోషంగా వుంటున్నాను .అని అనుకున్నానే తప్ప నేను తినడానికి ఆహారాన్ని పంపించేది ఎవరు అని నేను అప్పుడు ఆలోచించలేదు రాజు. అందుకనేయే రాము పెద్దలు ఎప్పుడు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని అనే వారు. 
    దేని గురించి తెలియకుండానే చులకనగా మాట్లాడకూడదు అని అంటారు. నువ్వు ఇన్ని మాటలు చెప్పినంక నేను కూడా మన పల్లే లోనే వుందాము అని అనుకుంటున్నాను రాజు. ఒక్కటి చెప్పుత విను రాము మనం ఎప్పుడు సుకం కోరుకోకూడదు. కష్టాన్ని సుకంగా భావిస్తు బ్రతకాలి రాము. 
   అన్ని నాకే తెలుసు అని అనుకోవడం గుడ్డితనం నాకు తెలియని విషయాలు ఇంకా ఈ ప్రపంచంలో దాగి వున్నాయి అని అనుకోవడం గొప్పతనం 
             కృతజ్ఞతలు 
కామెంట్‌లు