🔆ప్రశస్తమైన కాంతిని
కలుగజేయు వాడవు!
"ప్రభా కరుడవు" నీవె!
దివాకర! నమో హర! (1)
🔆అంతరిక్ష మార్గమున
సంచరించు వాడ వీవె!
"సూరుడవు" నీవె స్వామి!
ప్రభాకర! నమో హర! (2)
🔆విశేషమైన కాంతిని
కలుగజేయు వాడవు!
"విభా కరుడవు" నీవె!
ప్రభాకర! నమో హర! (3)
🔆నిత్య కృత్యముల యందు
ప్రేరేపించు వాడ వీవె
"సూర్యుడవు" నీవె స్వామి!
విభాకర! నమో హర! (4)
🕉️ ఈశానాయ, సూర్య ముర్తయే నమః!
( శ్రీసూర్య నమస్కార మంత్రం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి