పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెన్నయ్ శంకర నేత్రాలయ ఆసుపత్రి వైద్య బృందం వారు, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ సహాయ సహకారాలతో ఆదివారం ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. పాకాలలో ప్రతి నెల మూడో ఆదివారం జరిగే ఈ శిబిరానికి కంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారు 106 మంది హాజరయ్యారు. వీరిలో 17 మందికి ఆపరేషన్లు చేయాలని వైద్య బృందం నిర్ధారించింది. వీరిని ఆదివారం సాయంత్రం చెన్నయ్ శంకర్ నేత్రాలయానికి తీసుకెళ్ళి ఉచితంగా వైద్య సేవలతో పాటు భోజనము, వసతి కల్పించి ఆపరేషన్లు చేయనున్నారు. అనంతరం వీరిని తిరిగి బుధవారం తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మారసాని విజయబాబు, కార్యదర్శి మధురాంతకం జగదీశ్వరి, జి ఎం టి మెంబర్ అర్ వి ప్రసాద్, ఉపాధ్యక్షుడు మచ్చా కృష్ణమూర్తి నాయుడు, లయన్ ప్రతినిధులు గురుస్వామి నాయుడు, జయరామ నాయుడు, రేజర్ల దొరస్వామి నాయుడు, పోతుగుంట అనీల్ కుమార్, మారసాని మహేష్ బాబు, అలాగే పాకాల లియో క్లబ్ అధ్యక్షుడు గుండ్లూరు దొర పార్థు, జస్వంత్ తో ఈ పాటు పలువురు లియో సభ్యులు పలువురు పాల్గొన్నారు. వీరు వైద్య సేవలు కోసం వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి