526) ఆనందః -
సంతోషస్వరూపమునున్నవాడు
ఆనందదాయకుడైనట్టి వాడు
ఆశ్రితులనానందింపజేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
527)నందనః -
కుమారుడుగా కలిగినవాడు
సంతోషం పంచుకున్నవాడు
ఇంద్రవనములో నున్నవాడు
నందనవన విహారియగువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
528)నందః -
గోపాలకునిగా చరించువాడు
కలిమిని ప్రసాదించుచున్నవాడు
ఆహ్లాదము నిచ్చుచున్నవాడు
నందుని ఇల్లు చేరినట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
529)సత్యధర్మా -
సత్యస్వరూపము అయినవాడు
ధర్మమూర్తిగా నున్నట్టివాడు
వేదోక్తవిధిని జరుపువాడు
న్యాయమును ఎరిగినట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
530) త్రివిక్రమః -
ముల్లోకాలను కొలిచినవాడు
మూడడుగులతో నిండినవాడు
వామనావతారముననున్నవాడు
త్రివిక్రమనామముగలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి