అదుగదుగో ఎగురుతోంది జాతీయజెండా
గగనమంత నిండుతోంది భారతీయజెండా
!!అదుగదుగో!!
స్వాతంత్ర్య యోధుల ప్రాణప్రదమూ
గణతంత్ర పౌరుల మానధనమూ
పింగళి వెంకయ్య నేర్పుగచేసే
ప్రియతమ తాతయ్య ఓర్పుగకూర్చే
!!అదుగదుగో!!
తెల్లవారిగుండెల్లో నిదురించిందీ
మా చల్లారిన పౌరుషాగ్ని రగిలించిందీ
మూడురంగుల్లో మెరిసిపోతోందీ
మన అందరికీ స్ఫూర్తినిస్తోందీ
!!అదుగదుగో!!
పవిత్రతా త్యాగమూ అందించును కాశాయం
నిర్మలమగు దేశభక్తి శ్వేతవర్ణ ప్రతిరూపం
పాడిపంటల సంకేతం హరితవర్ణ శోభితం
ఈపతాకఛాయలోని సస్యశ్యామలదేశం
!!అదుగదుగో!!
సర్వమతాల సమభావననూ
సర్వజనాల సముపార్జనగా
పిల్లాపాపలూ చిన్నాపెద్దలూ
ఈ జెండానీడలో సుఖాలతేలగా
!!అదుగదుగో!!
**************************************
భారతీయజెండా;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి