శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
581)శమః -

అరిషడ్వర్గములు తొలగించువాడు 
శాంతమునే ఒసగునట్టివాడు 
క్రోధమును అణిచివేయువాడు 
శమమును స్థిరముగా నుంచువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
582)శాంతి -

శాంతి స్వరూపమున్నట్టివాడు 
శమమును కలిగించుచున్నవాడు 
సాధుత్వము ప్రసాదించగలవాడు 
శాంతినీయగలిగినట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
583)నిష్ఠా -

ప్రళయంలో ప్రత్యక్షమగువాడు 
తుదియందుతోడున్నట్టి వాడు 
వేడికోలుకు స్పందించినవాడు 
ఉనికిని ప్రసాదించగల వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
584)శాంతి -

శాంతి ప్రదాతగానున్నవాడు 
కలవరములు తొలగించువాడు 
కామక్రోధరాహిత్యమిచ్చువాడు 
ప్రశాంతతనొసగుచున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
585)పరాయణమ్ -

పరమోన్నతమైనట్టి వాడు
 అత్యుత్తమ స్థానమందున్నవాడు 
గొప్ప ఆసక్తియున్నట్టివాడు 
భక్తి పరాయణతను తీర్చువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు