అదుగో!
రసాలపల్లవాలు మెక్కిన పికరాజములు
ఇప్పుడిప్పుడే తమ హృదయగానాన్ని వినిపిస్తున్నాయి
తుమ్మెదలు తేనెనంతాగ్రోలి
మత్తుగా సోలిపోతున్నాయి
"మధుమాసమొచ్చిందోయ్!" అంటూ మల్లెపొదలు
మాంఛి పరీమళాలను ప్రసరింపజేస్తున్నాయి
అందుకేనేమో పిల్లగాలి చల్లగా వీస్తోంది
వేపలు వేగంగా పూస్తున్నాయి
మావిళ్ళు మళ్ళీ తెగ కాస్తున్నాయి
ఓహో! నాకిప్పుడు తెలిసింది
చిగురు సొగసులతో, పూల గంధాలతో
కొత్త అందాలు కనువిందు చేయడంలోని రహస్యం
చైత్రలక్ష్మి వేంచేస్తోందని ...కదూ?!
మాకు షడ్రుచులతో మేళవించిన
ఆనందాలను వెంట తెస్తున్నట్లుంది కదూ?!
ఆహా! నా తనువంతా చందనము అలదిపోయిన
మధురానుభూతికి లోనవుతోంది
అందుకేనేమో నా ఆత్మ పాలకెరటమై
పరవళ్ళుతొక్కుతోంది
అమ్మా! శ్రీక్రోధి వత్సరమా!
మా బతుకుల్లో అన్నీ
శుభాల జల్లులే కురిపించమ్మా!!
**************************************
రసాలపల్లవాలు మెక్కిన పికరాజములు
ఇప్పుడిప్పుడే తమ హృదయగానాన్ని వినిపిస్తున్నాయి
తుమ్మెదలు తేనెనంతాగ్రోలి
మత్తుగా సోలిపోతున్నాయి
"మధుమాసమొచ్చిందోయ్!" అంటూ మల్లెపొదలు
మాంఛి పరీమళాలను ప్రసరింపజేస్తున్నాయి
అందుకేనేమో పిల్లగాలి చల్లగా వీస్తోంది
వేపలు వేగంగా పూస్తున్నాయి
మావిళ్ళు మళ్ళీ తెగ కాస్తున్నాయి
ఓహో! నాకిప్పుడు తెలిసింది
చిగురు సొగసులతో, పూల గంధాలతో
కొత్త అందాలు కనువిందు చేయడంలోని రహస్యం
చైత్రలక్ష్మి వేంచేస్తోందని ...కదూ?!
మాకు షడ్రుచులతో మేళవించిన
ఆనందాలను వెంట తెస్తున్నట్లుంది కదూ?!
ఆహా! నా తనువంతా చందనము అలదిపోయిన
మధురానుభూతికి లోనవుతోంది
అందుకేనేమో నా ఆత్మ పాలకెరటమై
పరవళ్ళుతొక్కుతోంది
అమ్మా! శ్రీక్రోధి వత్సరమా!
మా బతుకుల్లో అన్నీ
శుభాల జల్లులే కురిపించమ్మా!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి