శ్రీ శిరిడీ సాయి లీలామృతం;- సి.హెచ్.ప్రతాప్
శ్లో:

మహాగ్రహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం
హరత్యాసుతే ద్వారకామాయిభస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ
శ్రీకారం నిత్యం శుభకరమ్ దివ్యం పరమం పవిత్రమ్
మహాపాపహరమ్ బాబా విభూతిమ్ దారయామ్యహమ్
పరమం పవిత్రమ్ బాబా విభూతిం పరమం విచిత్రం బాబా విభూతిం
పరమార్థ యిష్టార్థమోక్షప్రదాతం బాబావిభూతిం యిదమాశ్రయామి

ఒక సందర్భంలో బొంబాయిలోని కాయస్త ప్రభు కులానికి చెందిన ఒక మహిళ ప్రసవ సమయంలో చాలా బాధ పడేది. ప్రతీ ప్రసవం ఆమెకు ఒక కొత్త జన్మలా వుండేది. ఒక సందర్భంలో ఆమె గర్భవతి అయ్యింది.ఎప్పటి వలే ఈ సారి కూడా ప్రసవ సమయంలో తాను పడే బాధలను తలుచుకొని ఆందొళన పడసాగింది. ఆమె దూరపు బంధువైన కళ్యాణ్ నివాసి అయిన రామ మారుతి అనువాడు ప్రసవమునకు ముందు శిరిడీకు పొవల్సిందని ఆ కుటుంబానికి సలహా ఇచ్చాడు. ఆ భార్యాభర్తలిద్దరూ శిరిడీకి పోయి కొన్ని నెలల పాటు వున్నారు. ప్రతి దినము మశీదుకు పోయి బాబాను పూజించసాగారు. ప్రసవ సమయంలో ఎప్పటివలే ఆమె సమస్యలను ఎదుర్కోసాగింది. చుట్టుపక్కల వారు బాబా భజన చేయుచూ ఆమె చేత విభూతిని త్రాగించారు. ఆశ్చర్యం, కొద్దిసేపటిలోనే ఆమె నొప్పులన్నీ తగ్గిపోయాయి, సుఖ ప్రసవం జరిగింది, పండంటి కొడుకు పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీ సాయిని దర్శించి ఉదీ ప్రసాదములను తీసుకొని ఆనందంగా తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.శ్రీ సాయి ఊదీ చేసే మహిమలింతింత కాదయా !

కామెంట్‌లు