కవి, రచయిత 'అయ్యలసోమయాజుల'కు ఆంధ్రవిశ్వవిద్యాలయం లో ఆత్మీయ సత్కారం

  ఆంధ్రవిశ్వవిద్యాలయం లో  తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగిన   జాతీయ  సదస్సులో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాహిత్యం లో ప్రతిఫలాలు అనే సాహితీ చర్చా కార్యక్రమంలో కవి, రచయిత  సాహిత్య రత్న అయ్యలసోమయాజుల  ప్రసాద్ ,రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం   పాల్గొని కవులు, సాహితీ వేత్తలు సమాజాభివృద్ధికి సోపానాలని చెప్పగా సదస్సు కన్వీనర్ ఆచార్య అయ్యగారి సీతారత్నం, కో కన్వీనర్ ఆచార్య జె. విజయభారతి ,ప్రముఖ రచయిత్రి శ్రీమతి దామరాజు విశాలాక్షి గారు,సాహితీ వేత్త ఉత్తరాంధ్ర ప్రముఖ రచయిత శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు, సాహితీవేత్త కిలపర్తి దాలినాయుడు గారు, సాహితీ వేత్త శేఖరమంత్రి ప్రభాకర్ గారు,అంబేద్కర్ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య హనుమంతు  లజపతి రాయి విశిష్ట అతిధి ,ఆచార్య  నరసింహా రావు ప్రిన్సిపాల్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల మరియు అనేక సాహితీ అభిమానుల మధ్య దుశ్శాలువ, జ్ఞాపిక తో  ఆత్మీయ సత్కారం చేశారు. బదులుగా ప్రసాద్ మాష్టారు  తన మాతృ సంస్థ దేవాలయం లాంటి ఆంధ్రవిశ్వవిద్యాలయంలో సరస్వతీ సభలో సత్కరించటం చాలా ఆనందంగా ఉందని బదులిచ్చారు.
........................
కామెంట్‌లు