కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 అందానికి ఏమైనా కొలబద్ద ఉన్నదా  ఒకరు ఎలాంటి అలంకారాలు లేకుండానే  కంటికి ఇంపుగా కనిపిస్తారు  ఎన్ని ఆభరణాలతో వచ్చినా ఆమె చూడడానికి గంగిరెద్దులా కనిపిస్తుంది తప్ప అందగత్తెలాగా కాదు  అందం అనేది చూసే కంటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప అవతలి వారి  ఆకారాన్ని బట్టి  కాదు అని మన పెద్దలు చెబుతారు  మొహం పై చిరునవ్వును  అనుక్షణం  కలిగి ఉండే వ్యక్తి ఎవరైనా సరే  తన అందాన్ని ఇనుమడింప చేసేలా కనిపిస్తారు  చంటి పిల్లల దగ్గర నుంచి యవ్వనవతి వరకు ప్రతి ఒక్కరూ కూడా  ఆ నవ్వుతో పాటు అందమైన వ్యక్తిత్వం ఉంటే  ఆమెను మించిన అందగత్తె మరెవరు లేరు అనిపిస్తుంది  భౌతికమైన అందం కాదు మనకు కావలసినది  శీల సంపద ముఖ్యం  ఈ విషయాన్ని బిడ్డలకు తల్లి చెప్పాలి. మన పెద్దలు కొన్ని స్థలాలను చూసి ఇదేదో పెద్ద అడవిలాగా ఉందిరా అంటారు  పంట పొలాలు కాకుండా అందమైన చెట్లతో కూడి ఉన్న ప్రదేశాన్ని  రైతులు అలా అంటాడు  నిజానికి అది  అటవీ ప్రాంతం  దానివల్ల సమాజానికి ఏమిటి ప్రయోజనం అని ఆలోచించినట్లయితే  చెట్లు మానవ జాతిని బ్రతికిస్తాయి  ప్రతి ఒక్కరికి  ప్రాణవాయువు కావాలి జీవించడానికి  ఆ వృక్షం మనం వదిలిన  బొగ్గు పులుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని  మన ప్రాణాలను నిరవబెట్టే  ప్రాణవాయువును అంటే ఆక్సిజనులు విడుదల చేస్తుంది  మరి ప్రాణాలను నిలబెట్టే  చెట్టు ప్రజలకు ఎంత అవసరమైనదో  తెలుసుకున్నట్లయితే  ఎండిపోతున్న చెట్టు ఎక్కడైనా కనిపిస్తే దాని స్థానంలో మరొక మొక్కను నాటే మంచి మనసును పెంచుకుంటారు.
మన ప్రాణాన్ని నిలబెట్టడానికి  గాలి నీటితో పాటుగా  కడుపు నింపడానికి కొన్ని పదార్థాలు కావాలి  వరి ధాన్యంతో మనం వంట ఏర్పాటు చేసుకుంటాం  దానితో పాటు చెట్లు మనకు అందిస్తున్న ఫలాలను  స్వీకరించినట్లయితే  ఆరోగ్యరీత్యా అవి ఎంత గొప్పగా పనిచేస్తాయో  ఫలాలను వాడుతున్న వారు  అర్థం చేసుకుంటారు  అలా ప్రాణప్రదమైన  చెట్లను పరిరక్షించవలసిన బాధ్యత  మన అందరి భుజస్కంధాల పైన ఉన్నదా లేదా అన్నది  ప్రతి ఒక్కరూ ఆలోచించాలి  కొంతమంది వెళుతూ వెళుతూ సరదాగా ఆ కొమ్మని తుంచడం  చేస్తారు  అది నిజానికి తనకు ఏమైనా అవసరమైనదా అంటే కాదు  సరదాగా చేస్తాడు అంతే  దానివల్ల ఆ చెట్టుకు ఎంత నష్టం కలుగుతుందో ఆలోచిస్తున్నాడా  అలా ఆలోచిస్తే ఈ పని చేయడు కదా  అలాంటి వారిని ఆపవలసిన  బాధ్యత మనపై ఉన్నది అని మనం మర్చిపోకూడదు.

కామెంట్‌లు