మనిషి-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
వచ్చేప్పుడు ఒక్కడే కాదు
కాదు ఒంటరి
అమ్మ వేదన తోడు 

బతుకు 
ముళ్లూ పూలైన పయనం 
ప్రవాహ నది తీరం చేరే 
అలలు కొన్నే చేరనివెన్నో మరి
ఆశల ముంపులో తేలి నిలువడం 
సామాజిక రుగ్మతల దాటి గెలువడం
కత్తిమీద సామైన ఓ సాహసక్రీడ

వెళ్లే వేళ ఏకాకి కాదు మనిషి  
తోడు రాలేని ఆలోచనే చేదోడు
బతికేదే జీవనది మౌనం
తెరచాప వదిలిన నావ పయనం

దేహం మనసూ రెండూ
కావ్యాలైన గద్యపద్య పదాలు
మనిషి 
జీవచ్ఛవం  విగత జీవి గతం 
ఆకారం లేని విశాల గగనం ఆశ్వాసాలుగా పుటల్లో విప్పారేది 
బతికిన కవనం రాలిన పూలవనం నడుమ 
ఓ కల్పన కథ మరో జీవన కైత 


కామెంట్‌లు