కనీస బాధ్యత;- -గద్వాల సోమన్న,9966414580
బంధనాలు త్రెంచుకొని
బంధాలను పెంచును
ప్రగతి బాట నడవాలోయ్!
పది మందిని కలుపుకొని

ఆవేశం అణచుకొని
అనర్థమని తెలుసుకొని
అర నవ్వులు పోయిస్తూ
ఆరోగ్యం కాచుకొని

పొరపాట్లను దిద్దుకొని
మలిన మనసు కడుగుకొని
సూర్యునిలా వెలగాలోయ్!
ఆదర్శం చాటుకొని

బాధ్యతలను మోసుకొని
భగవంతుని తలచుకొని
అన్నీ నెరవేర్చాలోయ్!
చిత్తశుద్ధి అలవర్చుకొని

బాలికలను ఆదుకొని
కనుపాపలా చూసుకొని
భ్రూణహత్యలు తరమాలోయ్!
దృక్పథం మార్చుకొని

చేయి చేయి కలుపుకొని
అహం దుమ్ము దులుపుకొని
దేశకీర్తి నిలపాలోయ్!
మదిని స్ఫూర్తి నింపుకొని


కామెంట్‌లు