ఉంటే మేలు! మేలు!;- -గద్వాల సోమన్న,9966414580
కలువలు ఉంటే
కొలనుకు అందము
విలువలు ఉంటే
బ్రతుకుకు అర్థము

తరువులు ఉంటే
నిలుపును ప్రాణము
గురువులు ఉంటే
దొరుకును జ్ఞానము

వలువలు ఉంటే
మేనుకు లాభము
మగువలు ఉంటే
ఇంటికి క్షేమము

పల్లెలు ఉంటే
కడుపుకు మెతుకులు
పిల్లలు ఉంటే
గృహమున శుభములు

పువ్వులు ఉంటే
రువ్వును తావులు
నవ్వులు ఉంటే
పెరుగును సొగసులు

భానుడు ఉంటే
చీకటి దూరము
పెద్దలు ఉంటే
శోభస్కరము


కామెంట్‌లు