శబ్దాలంకార శ్లోకము ;- వివరణ:- విద్వాన్ పైడి హరనాథ రావు.,
   చైతన్యం పవనం వనం వనవనం, వానం వనం వామనం
    మాయాఫాల ధవం ధవం ధవధవం, మాయాధవం మాధవం
    నిత్యంసార సరం సరం సరసరం, సారం సరం సాగరం
    వైకుంఠం భువనం భవం భవభువం, భావం భవం భుజ్యతే!   
       🪷ఈ శ్లోకం.. ప్రాచీన కవి వ్రాసినది! శబ్దాలంకారమునకు సంబంధించింది! దీనిని చదువుతుంటే శ్రవణపేయంగా ఉంటుంది!
🚩వృత్యనుప్రాస అలంకారం...
         ఇందులో "వృత్యనుప్రాస" అనే అలంకారం ఉంది. ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే;  అది "వృత్యనుప్రాస అలంకారం" అంటారు. 
    ఈ శ్లోకంలో మొదటి పాదంలో "నం" అనే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయినది. 
   రెండవ పాదంలో "వం" అనే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయినది.
   మూడవ పాదం లో "రం" అనే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయినది. 
   నాల్గ పాదంలో "వం" అనే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయినది. 
       కావున ఇది "వృత్యనుప్రాస అలంకారం" అంటారు!
🚩చేకానుప్రాస అలంకారం...
      ఇందులో. "చేకానుప్రాస అలంకారం" కూడా ఉంది. రెండక్షరాల పదముల జంట అర్థ భేదంతో వెను వెంటనే ప్రయోగించినచో అది *చేకానుప్రాస ఆలలంకారం* అంటారు.
👌ఉదా: నంద నందన, అనాథ నాథ.
    ఈ శ్లోకం, మొదటి పాదంలో...  పవనం వనం, 
   రెండవ పాదంలో... మాయాఫాల ధవం ధవం;
   మూడవ పాదంలో... నిత్యం సారసరం సరం,
   నాల్గవ పాదంలో.   భవం భవభువం... అనే చోట్ల "చేకానుప్రాసాలంకారం" ఉన్నది.
       తల్లిదండ్రులు  ఉపాధ్యాయులు.. తమ బాల బాలికల చేత ఈ శ్లోకమును చదివించండి!

కామెంట్‌లు