2030 నాటికి మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో 80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు, నాలుగచక్రాల వాహన అమ్మకాల్లో 50 శాతం, బస్సుల అమ్మకాల్లో 40 శాతం నమోదవ్వాలని నీతిఅయోగ్ లక్ష్యం. దీనికిగాను భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా చార్జింగు వసతి కల్పించవలసిన అవసరం ఉంది
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ విద్యుత్ వాహనాల తయారీలో, వాటికి ఉపయోగించే పునర్వినియోగ బ్యాటరీ తయారీలో కనిపించని పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది. పునర్వినియోగ బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల మైనింగ్, పర్యావరణ, సామాజిక సమస్యలకు దారితీస్తుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక పేర్కొన్నది.పునర్వినియోగ బ్యాటరీ తయారీ లో ఉపయోగించే ముడి పదార్థాల మైనింగ్, పర్యావరణ, సామాజిక సమస్యలకు దారితీస్తుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక పేర్కొన్నది. ఈ బ్యాటరీల్లో వాడే లిథియాన్ని వాణిజ్య పద్ధతిలో ఎక్కువగా భూగర్భ ఉప్పు నీటి రిజర్వాయర్ల నుంచి సేకరిస్తారు. ఉప్పు నీటిని భూమి పైకి పంపు చేసి, బాష్పీభవన చెరువుల్లో కొన్ని నెలలపాటు నిల్వ ఉంచుతారు. సూర్యరశ్మి వల్ల ఆ నీరంతా ఆవిరై చివరికి లిథియం, వివిధ రకాల లవణాలు అవక్షేపించబడతాయి. ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో తీవ్రమైన భూ కాలుష్యం, ఇతర కాలుష్యాలు ఏర్ప డుతాయి. చిలీలోని సలార్ డి అటాకామాలో లిథియం, ఇతర మైనింగ్ కార్యకలాపాలకు 65 శాతం నీటిని వినియోగించుకోవడం వల్ల భూగర్భ జలాలు క్షీణించి నీటికొరత ఏర్పడింది.2030 నాటికి సుమారు 1.28 కోట్ల టన్ను ల లిథియం అయాన్ బ్యాటరీలు పనికిరాకుం డా పోయే పరిస్థితి ఉంది.విద్యుత్ వాహనాల్లో వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీల రేట్లు వినియోగదారులకు మున్ముందు భారంగా మారే అవకాశం ఉందని ఆటో ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కొన్ని అంశాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వీరు సూచిస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి