హిందూ ధర్మ పరిరక్షకుడు విద్యారణ్యునికి నా అక్షర కుసుమాలుఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)
వసుదైకానికే ఆదర్శమయిన
సనాతన హిందూధర్మాన్ని
కూకటి వేళ్ళతో నాశనం చేయ
ఢిల్లీ సుల్తాన్  దక్షిణ భారతదేశం పై యుద్ధం చేసి
హరి హర బుక్కరాయలను బందీలుగా చేసి
ఇస్లాం మతమును స్వీకరించమని బలవంతం చేయ నిరాకరిస్తే
వారి పరాక్రమాలను చూసి 
దక్షిణ భారత దేశంలో దండయాత్రలను నిరోధించడానికి
సేనాధిపతులుగా పంపిన
వారు తమంత తామే స్వాతంత్య్రం ప్రకటించుకుని
స్వప్నం లో వచ్చిన  విషయ ఆధారంగా
మతంగ పర్వతం మీద
తపస్సు చేసుకుంటున్న
విద్యారణ్యుని చే ఆశీర్వదించబడి
తుంగభద్ర నదికి కుడివైపు
సామ్రాజ్య స్థాపన చేసి
"ధర్మో రక్షతి రక్షితః" అని
సనాతన ధర్మాన్ని  కాపాడి
ఎడమ వైపు కూడా విస్తరణ చేసి
హంపి నగరాన్ని శ్రీచక్రము ఆధారంగా
నగరం మధ్యలో విరూపాక్ష దేవాలయం ఉండేటట్లు
తొమ్మిది గుమ్మాలతో
నిర్మించిన విద్యానగరమే
ఆంధ్రభోజునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవరాయులు పరిపాలించిన హంపి విజయనగరం.

విద్యారణ్య స్వామి  ఆధ్వర్యములో హరి హర రాయలు  మొదట సింహాసనం అధిష్టించాడని
'ఆత్మవిద్య'ను స్వయంగా హరిహరునికి భోధించిన మహనీయుడు
శృంగేరి పీఠాధిపతిగా వేదప్రామాణికంగా
ఆరు సంవత్సరాల పాటు  కర్తృత్వం వహించిన విద్యారణ్య స్వామి
గొప్ప యోగి, ఆది శంకరునిలా హిందూధర్మ పరిరక్షణ కోసమే
దివినుంచి భువికి దిగి వచ్చిన సాక్షాత్తు పరమేశ్వరుని ప్రతిరూపమే.
శృంగేరి పీఠం మేథా దక్షిణామూర్తి నిలయమే
వైశాఖ శుద్ధ సప్తమి నాడు
జనియించి ఆర్ష ధర్మ సంరక్షణ ,హైందవ సామ్రాజ్య స్థాపనచేసిన మీకివే నా అక్షర కుసుమాలు....!!
...........................
(వైశాఖ శుద్ధ సప్తమి  మహనీయులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి జయంతి సందర్భంగా)
================================
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)
రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి.
విశాఖపట్నం.
.........................

........................

కామెంట్‌లు