శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
746)చలః -

సదా చలించుచున్నట్టి వాడు 
స్థానములు మారుతున్నట్టి వాడు 
విశ్వమంతయు నిలువగలవాడు 
సర్వలోకాలకు వెళ్ళగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
747)అమానీ -

నిగర్వియై చరించుచున్నవాడు 
నిరాహoకారముతో నున్నవాడు 
అభిమానం వదులుకున్నవాడు 
నిమిత్తమాత్రునిగా నున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
748)మానదః -

భక్తులకు గౌరవమిచ్చువాడు 
తనవారికి మన్ననలిచ్చువాడు 
మర్యాద అందించినవాడు 
మాననీయుడై యున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
749)మాన్యః -

పూజింపదగిన దివ్యతున్నవాడు 
మాన్యుడయి మహిమలున్నవాడు 
భక్తుల మన్ననలు పొందినవాడు 
గౌరవం పొందుచున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
750)లోకస్వామీ -

పదునాల్గు భువనములవాడు 
లోకములకు స్వామియైనవాడు 
విశ్వమంతటికి నాథుడైనవాడు 
లోకస్వామిగా వెలసినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు