కీర్తి సేవలకు భువనేశ్వర్ లో అభినందన సత్కారం

 విశాఖపట్నం శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కుప్పిలి కీర్తి పట్నాయక్ స్వచ్చంద సేవలను కొనియాడుతూ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ శిష్టకరణ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఆరోగ్యం సమయం వ్యయ ప్రయాసలకోర్చి, తదితర సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్న కీర్తి కృషిని గుర్తించి ఈ సత్కారం జరిగింది. కీర్తి పట్నాయక్ ను భువనేశ్వర్ ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త, ఇన్ స్టిట్యూట్ ఎం.డి. ఒడిశా శిష్టకరణ అసోసియేషన్ అధ్యక్షులు, పసిఫిక్ ఆసియా పురస్కార గ్రహీత రఘుపాతృని భీమారావు, ఒడిశా శిష్టకరణ అసోసియేషన్ కార్యదర్శి     జక్కువ చక్రపాణి పట్నాయక్, జాయింట్ డైరక్టర్, రిజిస్టర్ ఉరిటి హరిశంకర్ పట్నాయక్, ముఖ్య అతిథులు ఒడిశా ప్రభుత్వ మెడికల్ డైరక్టర్ జి.యు.ఎన్.రాణి పట్నాయక్, కల్చరల్  ప్రోగ్రామ్  ప్రోఫెసర్ ల చేతులమీదుగా శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కీర్తి పట్నాయక్ కు భువనేశ్వర్ లో జరిగిన అభినందన సత్కారం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు